a256

256

రాగం - బిలహరి
(చాయ : కొనియాడ దరమె నిన్ను )తాళం - ఆట
    మమ్ము ప్రేమ జూచి దేవుడు మకు బోధపరపగ ఇమ్ముగాను లేఖనముల నిచ్చె మాకు భూమిపై ||మమ్ము||

  1. మా మొగంబు నద్దమందు మేము చూచునట్లు మేము గాన వచ్చు మాస్థితి మిగుల దేటగ నందులో ||మమ్ము||

  2. పాప మనెడు బురద గోతిని బడిన మమ్ము నెత్తగా పాప రహితుండైన యేసు ప్రాణ మిచ్చెను బ్రేమచే ||మమ్ము||

  3. పాప మంతయు వీడి మేము భక్తి సరణిని నడువగ ప్రాపుగా దన యాత్మ నిచ్చె ప్రాణసఖుడగు యేసుండు ||మమ్ము||

  4. సకల జనులు లేఖనముల సత్యములను దెలియుచు అకలుషముగ వానినమ్మగ నంపు మాత్మను రక్షకా ||మమ్ము||

Post a Comment

Previous Post Next Post