a257

257

రాగం - బిలహరి
(చాయ : కొనియాడ దరమె నిన్ను )తాళం - ఆట
    శ్రీ వినోద దాయకంబు దేవుని వాక్యంబు జీవమునకు నాస్పదంబు చిరమగు ధనంబు భావంబుల మార్చు నంబు బహుళ సాధనంబు ||శ్రీ||

  1. పాప తతికి నాయుధంబు పాపి కాశ్రయంబు భూపతులకు దుస్తరంబు పుణ్య సాధనంబు శాప మడంచెడు శరంబు జగతికి విభవంబు ||శ్రీ||

  2. స్వాతంత్ర్య మిడు దనంబు సర్వశ్రేయంబు ఘాతకులకు ఖడ్గంబు నీతికినిలయంబు ప్రీతిని గరపెడు విధంబు ఖ్యాతికి బథంబు ||శ్రీ||

  3. సత్య విరాజితంబు నిత్య శోభితంబు భృత్య వరుల సంచకరము భీతున కభయంబు చేతో విభవంబు సుగుణ శిష్యుల హారంబు ||శ్రీ||

  4. కర్త జూపు నద్దంబు ఘనమహాద్భుతంబు దురితతతికి నస్త్రంబు దు ఖశోషణంబు పరమోపదేశంబు బహుళమానితంబు ||శ్రీ||

  5. సర్వజనులకును హితంబు సౌఖ్యసాధనంబు శాంతికి నిజమార్గంబు జగడముల హరంబు జగము నంతకును వరంబు సత్యవిజయంబు ||శ్రీ||

  6. కోలాహల కారణంబు చాల ప్రాచీనంబు మూలమౌ ధనంబు జగము నేలెడి తంత్రంబు జాలియె దన సూత్రంబు మేలు భూషణంబు ||శ్రీ||

  7. జ్ఞానికి దుర్ గ్రాహ్యంబు దాని బోధనంబు దీనజనుల కర్థంబు దివ్య శోభితంబు మానితభక్తిని దినంబు మానని పఠనంబు ||శ్రీ||

Post a Comment

Previous Post Next Post