262
రాగం - బిలహరి(చాయ : కొనియాడ దరమె నిన్ను )తాళం - ఆట
- దేవుడిచ్చు బహుమానమె బిడ్డలు గర్భఫలమె మన కిడు స్వాస్థ్యం ఇంపుగ ప్రతిష్టింపను వారిని సంఘమ నీ బాధ్యతగాదా? ||ప్రభు||
- యువకులు రేపటి సంఘము నందున నాయుకు లౌదురు నయముగను పావనులుగ నిల జేయను వారిని సంఘము నీ బాధ్యత గాదా? ||ప్రభు||
- బాప్తిస్మమును కృపా ప్రసాదములు ప్రభు వెంచెను పరిశుద్ధముగ ఘనముగ వాటిని గైకొన నిరతము సంఘము నీ బాధ్యతగాదా! ||ప్రభు||
- దేవుడు జతపర్చిన దాంపత్యము భావములర బంధుత్వములున్ సవ్యంబుగసరి జేయగ వాటిని సంఘ మ నీ బాధ్యతగాదా? ||ప్రభు||
- పామర జనములు ప్రభు నెఱుంగక పెడ మార్గంబుల దిరుగగను మానుగ రక్షణ మార్గము జూపుట సంఘ మ నీ బాధ్యతగాదా? ||ప్రభు||
- క్రైస్తవ దాతృత్వము నందెదుగుట కర్తను కీర్తించుట యౌను దశమ భాగములు దాత కొసంగను సంఘ మ నీ బాధ్యత గాదా? ||ప్రభు||