270
రాగం - బిలహరి(చాయ : కొనియాడ దరమె నిన్ను )తాళం - ఆట
- మాటిమాటికి బాపయుతంబౌ మార్గమున జను మనసుల ద్రుంచి మేటి క్రీస్తుని నామా మృతము గ్రోలుచు మేమా పాటున నాత్మల రక్షణకై పనులు సల్ప(గ బంపుము కృపచే ||దీవెనల||
- దివ్య బోధ లెదను గల్గి దీనతను రక్షణ మార్గమును భవ్యముగ బోధింప బరమార్థ మెఱిగింప సేవ్య నేర్పవె దిన దినమును నీ సేవకాళికి నీ మర్మముల ||దీవెనల||
- దురిత రోగాదులచే మిగుల తూలి చను మనుజాళికి నీవే పరమ విశ్రాంతి నిడు వరదుడ వంచుగడు వెరవునను బోధింపంగను నీ వర ములతో నింపుము దాసులను ||దీవెనల||
- గ్రామ సంఘంబులను బడుల క్షేమముగ గాపాడి పెంప ఓ మహాత్మ నీ కృప తో మమ్ము గాచి సదా స్వామి మాలో నీవును నీలో మేము మనగను బ్రోవు మామేన్ ||దీవెనల||