271
రాగం - బిలహరి(చాయ : కొనియాడ దరమె నిన్ను )తాళం - ఆట
- తన కన్నను ముందు యోహా నను నత డింపొందు ఘనతర మగును ప్రవచనముబ ల్కెను భూజను లందు ||వినరే||
- అతడు యోర్దాను నదిలో ఖ్యాతిగ ననుదినమున్ పాతకులకు బా ప్తిస్మ మిచ్చు నెడం ప్రభు వచ్చటి కరిగెన్ ||వినరే||
- న్యాయము నిలుపుటకై ప్రభుని వి ధేయత గనుపఱచి శ్రేయ పతి బొం దెను యోహానుని చేత బాప్తిస్మంబు ||వినరే||
- పరమండల మపుడు తెరవం బడి పావురము గతిన్ పరిశుద్ధాత్మ శు భప్రభ లీనుచు ప్రభువు మీద వ్రాలెన్ ||వినరే||
- ఆకాశమునుండి కలిగెను ప్రాకటమగు రవము నా కితడు ప్రియం బౌ కుమారుడా నంద మొంది రనుచు ||వినరే||
- అంతట మన కర్త పరిశుద్ధాత్మ బలము కలిమిన్ సంతసమున మో క్ష కుశలవార్తను జాటంగను దొడగెన్ ||వినరే||
- ఆ నిత్య సువార్త మన మెద లో నిడి నమ్మినచో నానందమయం బమృత మేసు ద యా నిధి మన కొసంగున్ ||వినరే||