a273

273

రాగం - బిలహరి
(చాయ : కొనియాడ దరమె నిన్ను )తాళం - ఆట
    యే సొసంగె గొప్ప యాజ్ఞను తన శిష్యులకును యేసొసంగె గొప్ప యాజ్ఞను దాసులునుగ జేయ బోయి ధరణిమీది రాష్ట్రములకు ఆ సను బాప్తిస్మ మిచ్చి నా సుబోధ నేర్పుడనుచు ||యేసొసంగె||

  1. జనక కుమారాత్మల పేర బాప్తిస్మ మియ్య చనుడు మీరు సకల దిశలను తనయు లైన తల్లులైన తండ్రులైన బొందవచ్చు దగిన రీతి దాని నిపుడు తండ్రియైన దైవ కృపను ||యేసొసంగె||

  2. బాలు రెల్ల బొందవచ్చును బాప్తిస్మ మిపుడు జాలి జూపు క్రీస్తు సెలవున బాలు రందు బ్రేమ నుంచి ప్రభువు పిలుచు వారి నెల్ల జాల మేలు సేయ గోరి సకల కాలముల యందు ||యేసొసంగె||

  3. పొందవలయు బాప్తిస్మము శుద్ధాత్మ చేత విందు గలుగు మనుజు లందరు మంద బుద్ధి విడిచి పెట్టి మహిమ గల్గు దేవు గొల్వ నందము గను లేచి రండి హర్ష పూర్ణు లగుచు మీరు ||యేసొసంగె||



Post a Comment

Previous Post Next Post