275
రాగం - బిలహరి(చాయ : కొనియాడ దరమె నిన్ను )తాళం - ఆట
- పాపము లెడ బాపను యిలకరిగిన ప్రభువు మహిమ వినుడి మీ మీ పాపములను దలపోసి హృదయముల పశ్చాత్తాపపడి యా పరమగురుని నామముద్వారా ననుసరించి ముంచడము బొందు ||రండి||
- తన మహిమను బలమును దైవత్వము తగ్గించుకొని వడి యప్పుడు తన సేవకుడని మదిదలపోయని తగు నీతిని గనుడీ క్రీస్తుండును బాప్తి స్తు డు యోహానునిచే మునుకొని యోర్దాన్నదిలో ముంచుటగని ||రండి||
- మురియుచు క్రీస్తువు యోర్దాన్నదిలో ముంచబడినరీతి నిప్పుడు గరిమెతో క్రీస్తుని నమ్మిన జనములు గైకొనుటది నీతి మరువక స్థిరముగ మీ మనముల నెల్ల ప్పుడు నరమరవిడి క్రీస్తుని తగజేర ||రండి||
- తల్లులు తమ బిడ్డల కాశీర్వాదము లిమ్మని తేగా నప్పుడు చల్లగ బాలుర కాశీర్వాద మెసగె ప్రభు విదిగాక క్రీస్తుడు తొల్లి జనములకు ముంచడ మిచ్చిన టెల్ల విధులలేదు వేదమున ||రండి||
- అందుచేత వేదమున బాప్తిస్తుండనబడె యోహాను ఇప్పుడు పొందుగ ముంచువారు బాప్తిస్తులు పొసగగ సరిగాను మీరలు నందఱు విన సత్య వేదవాక్యము సందియములు విడి సాగి వేగమున ||రండి||