a279

279

రాగం - బిలహరి
(చాయ : కొనియాడ దరమె నిన్ను )తాళం - ఆట
    దేవా దీవించు మిప్పుడు దీన జనాళిన్ గావ రా రమ్మెల్లప్పుడు నీ వరగద్దెచుట్టు నిజ దాసు లిటుల గూడి పావన సంస్కారమును బంచి పాలొందుచుండ ||దేవా||

  1. మము గావ నైదు గాయముల్ బొందిన దేవ సముడా నీ రక్త కాయముల్ విమలింపు భక్తి ద్వారా వీక్షించి మనసులందు అమిత దుః ఖ మొందుటచే నలిగిన భక్త జనులన్ ||దేవా||

  2. నీ రాజ్యమునకు మము జేర్ప నిజము మా పాప ఘోర శాపమ్ములన్ దీర్ప నోరిమిచే మా కొరకు దారుణముగ నొందిన క్రూర మరణమును దలచి కుములుచున్న హృదయులను ||దేవా||

  3. కోరి నిను గొలుచు భక్తుల కోరిక లభివృద్ది గా రాజిలజేయు శక్తుల ధారాళముగ నొసంగు ధనాత్ముండ నీ దివ్యా కార మందుండి యీ సం స్కార సమయమున మమ్ము ||దేవా||

  4. మా దారిద్ర్యములు బాపనే పాపభారంపు మ్రాను నీ దివ్య మూపుననే గాదిలిచే భరియించి గడి దొంగ లిరువురిలో బాధ లొందితి వనుచు బహుగా దుఃఖించు మమ్ము ||దేవా||

  5. నీ వీ విధంపు మరణముచే నిజముగా మమ్ము జీవింపజేసి నిల్పుటచే పావనదేవ మే మీ ప్రభు సంస్కారమ్ము మా మా జీవాత్మ లాదరణకై జే మనముగ గైకొనను ||దేవా||

Post a Comment

Previous Post Next Post