a280

280

రాగం - బిలహరి
(చాయ : కొనియాడ దరమె నిన్ను )తాళం - ఆట
    చేరి భుజియింపుడీవిందు యేసు సిద్ధపరచిన కృపావిందు తోరణంబగు మేడ గదిలో జేరి శిష్యుల తోడ సిలువ భారమున్ మదినెంచి నెరపిన భావ గర్భితమైన విందు ||చేరి||

  1. జీవాహారము దైవసుతుడే పరమ జీవజలముల దాత యితడే జీవనాధుని రక్త మేనులు జీవానాహారములు కాగా చావును దొల గించి మృతులస జీవులనుగా మార్చువిందు ||చేరి||

  2. కారుణ్యనిధి యేసు రాజు నరుల గావగ బలియైన రోజు భారమైన సిలువ కెరయై పాప భారము పరిహరింప ధారవోసిన పుణ్యరక్తపు ధారలన్ దలపోయు విందు ||చేరి||

  3. దాసగణముల బ్రోవనెంచి రుధిర ధారలను గార్చిభరించి భాసు రంబగు నవ నిబంధన జేసి సంఘ పునాది వేసి వాసి మీరగ నిత్య జీవము బోసినట్టి యేసు విందు ||చేరి||

  4. పాప పరిహారార్థముకై క్రీస్తు పడిన ఘోరబాధ కొరకై యేపు దనరగ స్తుతులుబాడుచు యేసునాధుని రాకవరకు ఆపకుండగ సత్ప్రసాదము నందుకొని బలమొంద రండి ||చేరి||

  5. విందుతో మొదలిడిన సేవ యేసు విందుతో ముగియించె బ్రోవ విందులోగల మర్మమేదియొ విపులముగ బోధించు క్రీస్తున్ డెందమున ధ్యానించి యాయన యందె నమ్మిక గలిగియుందము ||చేరి||

Post a Comment

Previous Post Next Post