a285

285

రాగం - బిలహరి
(చాయ : కొనియాడ దరమె నిన్ను )తాళం - ఆట
    శ్రీ రాజిల్లుచు యేసు క్రీస్తు వేంచేసెను భారతిని జయించి ప్రజాళిన్ బ్రోచును! ఆరాజు శాశ్వితుండు భూరిదయాళుడు వీరాగ్రేసరుండాజిన్ విజయ ధ్వజంబదె!
    ఆ హిమాచలమందు నాటెక్కె మెత్తెను కాహళ ధ్వనియందు గ్రందుకొనెనటన్! సౌహార్థ భావమూని జనాళిన్ బ్రోచుగ ఆహా యీ యేసుప్రేమ యాశ్చర్యమైనది!
    ఆంధ్ర కాశ్మీర వంగ ఆ సేతువాసులు ఆంధ్రప్రాయులైయున్న యరణ్యవాసులున్ బంధ విముక్తలౌచు ప్రభువైన యేసుని బంధుర సేవచేయు వారలయ్యెదరు
    వీరెల్ల క్రీస్తునందు విశ్వాసముంచిన ఆ రాజు వీరిన్ శాశ్వ తానంద సామ్రాజ్య ధౌరేయులన్ గావించు ఔర! యీ వార్తను స్ఫారానందంబుతోడ జాటుదు రెవ్వరు!
    భేరీ తూరారవాది గా రక్షావార్తను దోరంపు గోర్కె జాటు మో దేశ సంఘమా! సౌరభ్యమౌ నీ ప్రేమ సారంబు జూపుము ధీరతన్ యుద్ధమందు బోరాడి గెల్వుము

Post a Comment

Previous Post Next Post