a286

286

రాగం - బిలహరి
(చాయ : కొనియాడ దరమె నిన్ను )తాళం - ఆట
    గ్రీన్లాండ్ దేశస్థులును ఇండియా జనులున్ ఆఫ్రికా ఖండమందు నివాసులెల్లరు సముద్ర ద్వీపస్థులు సువార్త వెలుగు మాకు నిప్పించుడని మమ్మును పిల్తురు.
    మా దేవుడిచ్చు సుఖ సుక్షేమ యీవులు ఒక్కొక్క దేశమందు విస్తారమైనను అజ్ఞానులైనవార లా సత్య దేవుని గొల్వక వేరువాటిన్ పూజించుచుందును.
    సువార్తకాంతి మాకు ప్రకాశమైనదా అజ్ఞానులందరికి దాని మేమియ్యమా రక్షణ దివ్యవార్త లోకస్తులెల్లరు విని మా యేసుమీద విశ్వాసులౌదురు.
    సుక్షేమకరమైన సువార్త సంగతి గాలి తరంగములు వ్యాపింపజేయుడీ మా సృష్టికర్త రాజు నిర్దోషి యాయనే మా యేసు దిగి వచ్చి యీ లోకమేలును.

Post a Comment

Previous Post Next Post