a287

287

రాగం - బిలహరి
(చాయ : కొనియాడ దరమె నిన్ను )తాళం - ఆట
    శ్రీయేసు రాజ్య ముండును సూర్యుండు వెల్గు చోటెల్ల కల్పాంతకాల మౌదాక ఆ రాజ్యము వ్యాపించును.
    నిరంతరంబు ప్రార్థనల్ నిత్య స్తుతుల్ శ్రీయేసుకు తన్నామము ప్రత్యహము సుగంధ మట్లు లేచును.
    సమస్త దేశ వాసులు గణింతు రేసు ప్రేమను శ్రీ యేసు పేరు బాలకుల్ బాల్యంబున నుతింతురు.
    యేసుని యీవు లొల్కును ఖైదికి సంకెళ్లూడును డాయంగ శాంతి కల్గును సుభాగ్య మబ్బు పేదకున్
    శ్రీ యేసు శక్తి చేతను స్వస్థంబు గల్గు నెల్లెడన్ దచ్ఛక్తి యున్న మేరలన్ నశించు మృత్యు శాపముల్.
    మా రాజు కెల్ల సృష్టియున్ విశేష స్తుతుల్ సల్పుతన్ దూతాళి మళ్లి పాడగా ఘోషించు భూమియు ఆమేన్

Post a Comment

Previous Post Next Post