293
రాగం - బిలహరి(చాయ : కొనియాడ దరమె నిన్ను )తాళం - ఆట
- రండి రండి మిత్రులార నిండు ధైర్య పడండి వేగమె దండైన యండ మన కుండు యేసుండని ||పాపులకు||
- దాహ మణంచు దేవ వాక్యము దేహధారులార రండి దేహీ యన విహీనుల సాహాయ్యము నోహో యని ||పాపులకు||
- ద్రవ్య మించుక లేని విక్రయ మయ్య యీ యేసయ్య రక్తము చేయలే మయ్య మన మయ్య దుర్నయ్యముల్ ||పాపులకు||
- నిండు మనసు గలిగియే సండజేర రండి వేగమె నిండు ప్రియుండు న ఖండ పురుషుండని ||పాపులకు||
- నింద లన్ని పొంది ప్రభుని మందలో వెలుగొందరే తఱి పొం దుగ నిందలో నుందు రానందమున ||బాపులకు||