296
రాగం - బిలహరి(చాయ : కొనియాడ దరమె నిన్ను )తాళం - ఆట
- యేసు క్రీస్తుకంటె పోషకు లెవ్వరు లేరుసుమీ దోషుల తన దాసులుగా దీసియు దోసము బాపు సుమీ ||నమ్మరె||
- నరకము నొందక మీ రయ్యో నరకము బాధ సుమీ న్యాయము కాదుసుమి నరులార నష్టము మీకు సుమీ ||నమ్మరె||
- తండ్రి కొమరుడు విమ లాత్ముడు త్ర్యేకదేవుండు తండ్రి వలెను మనలను పాలించును తండ్రిగ నమ్ముదము ||నమ్మరె||
- ధరణిలో నొకడైన చూడరె ధన్యుడు లేడనుచు దీర్ఘదర్శి దావీదు తెల్పె నిటు దీనుల కందఱికి ||నమ్మరె||
- ప్రభు మన పాపముకై ప్రాణము బలిగా నిచ్చునుగా పాపము మోసెను మృతియై లేచెను పాపుల బ్రోచుటకై ||నమ్మరె||
- దేవసుతుని రక్తం అబ్బిన ద్రోహుల కతిప్రొయము పావన మొనరించును పాపికి నిక జీవనమై యుండున్ ||నమ్మరె||