a297

297

రాగం - బిలహరి
(చాయ : కొనియాడ దరమె నిన్ను )తాళం - ఆట
    యేసు క్రీస్తుని గొల్వ రన్న యీ జగతిలోన నెవ్వరు లేరు వాని కన్న యేసుని వాక్యము ఎవ్వరి కబ్బునో దోసము విడి పర వాసము దొరకును ||యేసు||

  1. సత్యుడు నిత్యుడాయ నన్న యీ సర్వ సృష్టి జక్కగ సలిపి నిలిపె నన్న వ్యత్యాసము లే మియు లేకుండగ సత్యుండు చేసెను సర్వజగం బును||యేసు||

  2. నిరాకారుడు నిశ్చయుడన్న నరుల రక్షింప నరావతారుడై నాడన్న నరుల పాపములు పరిహరించుట కొరకై మరియ కొడుకై పుట్టెను ||యేసు||

  3. పరిశుద్ధవంతు డాయ నన్న ప్రభు యేసు నంద పాపమే గాన బడుట సున్న పరులను గావను ధరలో దిరిగెను నరుల నడుమ బహు నిరపరాధముతో ||యేసు||

  4. భేదాభేదములు గాని బోధ నాధుడొనరించె సాధు లెల్లను సంతోషింప బాధలుబడు స ద్రిక్తులతోడను సాదర వాక్కులు జక్కగ పలికెను ||యేసు||

  5. మహిలోన మనుజు లెవ్వ రైన జేయ లేనట్టి మహిమాద్బుతముల జేసె నన్న మహా రోగులను మఱి మృతులను మహా మహుండు స్వస్థుల మఱి గావించెను ||యేసు||

  6. వర్ణింప వలనుకాని వాడు మన కోసర మతడు మరణమై మరల బ్రతికినాడు పరలోకమునకు మరి వేంచేసిన పరు డగు క్రీస్తుని పాదము బట్టుము ||యేసు||

  7. పరిశుద్ధ దూతల నాదముతో ప్రభు యేసు క్రీస్తు ప్రకాశ వస్త్ర మహిమలతో పరమునుండి బహు త్వరగా వచ్చును ధరలో నమ్మిన నరులను బ్రోచును ||యేసు||

  8. న్యాయంబు దీర్చు దినము గలదు నమ్మని వారెల్ల సాయంబు వెదకినను గనపడదు సువార్త న్యాయము దీర్చును నడవడి చొప్పున నమ్మని పాపుల నరకము జేర్చును ||యేసు||

  9. నమ్మండీ నష్టము నొందక యేసుని నమ్మిన పొమ్మని చెప్పడు సుమ్మండి ఇమ్ముగ గృపతో నిలలో గాచును పిమ్మట మోక్ష పురమున జేర్చును ||యేసు||

Post a Comment

Previous Post Next Post