a295

295

రాగం - బిలహరి
(చాయ : కొనియాడ దరమె నిన్ను )తాళం - ఆట
    మన మొదటి తల్లిదండ్రులల్ మాయకు లోనైరి అన్నలారా వారి కనుగొనలకు సిగ్గు గదుర మోములు వంచి రన్నలారా ||మన||

  1. తమ నగ్నతను జూడ దా మొప్ప లేరైరి అన్నలారా కొన్ని యమరిన మఱ్ఱాకు లంగంబులను గట్టి రన్నలారా ||మన||

  2. పరమాత్ము డిడు నాజ్ఞ పాలింప లేరైరి అన్నలారా పూర్వ పరి శుద్ధత నెడబాసి పాపాత్ములై పోయి రన్నలారా ||మన||

  3. నరవంశజుల కెల్ల తరలె దద్దురవస్థ అన్నలారా క్రీస్తు మర ణంబు మన పాప హరణంబు గావించు నన్నలారా ||మన||

Post a Comment

Previous Post Next Post