308
రాగం - బిలహరి(చాయ : కొనియాడ దరమె నిన్ను )తాళం - ఆట
- పరమాత్మ మీదనే గురి నిల్పు మని దెల్పు వరబోధమది నెంచవు నిరత మును రాత్రియును బవలును నిరవు ధనమును ఘనము సౌఖ్యము లరయు చుందువు క్షణము నీవా పరమ ధర్మము సరకుజేయవు ||పాప||
- కనివినంగ నుదగని పనికిమాలిన క్రియల దనిసి భ్రమయుచు నుందువు ఘనుల పెద్దల జననీజనకుల ననిశమును నిరసించి మెలగెడు వినయరహితంబైన జీవిత మునకు నేమి ఘటిల్లునోకను ||పాప||
- పెరవారలను బ్రియసో దరులుగ బ్రేమింప పరమాత్మపురికొల్పదే పరులపై ద్వేషంబు పగగొని పలుతెరంగుల బాధపఱచుచు ప్రాణహత్య లొనర్చు నీకు పరమ పదము లభింపసాధ్యమె ||పాప||
- పాప పరిహారార్థ ప్రాయశ్చిత్తము జేసి ప్రాణమర్పించె నెవరో ఆ పరాత్పరు నాశ్రయించుము శాపభారము బాపిబ్రోచును మాపు రేపునులేని స్వర్గ ప్రాప్తికల్గును నిత్యశుభమగు ||పాప||
- పాపభారము క్రింద పడికుందు మీకునే పరగనిత్తును శాంతిని దాపు నకు రండంచు పతితుల దయను బిలచెడు యేసుక్రీస్తును పాపి కాశ్రయుడంచు నమ్మి భక్తితో ప్రార్థించి వేడవే ||పాప||
- శరణీయ వరమోక్ష పురమందు ఘనసౌఖ్య పరమానందము లొందుచు వరుల దూతల భక్తగణముల సరసదేవు స్మరించు భాగ్యము గురుడు నీకిడగోరి పిలుచుచు కరము జాపెను కౌగిలింపవె ||పాప||