309
రాగం - బిలహరి(చాయ : కొనియాడ దరమె నిన్ను )తాళం - ఆట
- ఒక్క పెట్టున నెగసి చక్క వెల్ళుద మన నీ రెక్క లక్కఱకు రావు ఎక్కడైనను నోడ గనుగొని యెక్కిపోద మని తలంచిన జెక్క నిర్మతమైన యోడ లక్కఱకు రావేమి సేతుము ||దారుణ||
- మంగళ ధ్వనులతో శృంగారపురము వె లుంగుచున్నది ముందట పొంగి పారుచు మరణ నది త రంగముల జెలంగుచున్నది భంగపడకుడి మనకు క్రీస్తు సువార్తయను పెను నావ యిదిగో ||దారుణ||
- వాద రహితుండైన యాది దేవుడు దాని నాధుం డనం బరగును బాధ లొందిన నరుల నందరి జేరదీసిన క్రీస్తు యేసు నాధుడే నావి కు డు క్రైస్తవ వేదమే చుక్కాని దీవికి ||దారుణ||
- మానవు లందరు మరణాంబుధిని దాట మహనీయ మగు నావ యిదె దీనిలో నెక్కుటకు ముందే మానుగ వాక్యమును విని సు జ్ఞాన మొందినవారు క్రైస్తవ స్నాన మను పత్రికను బొందరె ||దారుణ||
- విదితంబుగా నిందు విజ్ఞాన బోదకుల్ వినిపించుదురు వాక్యము గొదగొనిన యాత్మములు తృప్తి గొనును బ్రభు భోజనములోనే హృదయములలో దేవునాత్మ యెపుడు దీపంబై వెలుంగును ||దారుణ||
- పలువిధ సంగీత ములతో సాగుచు మనము నలయ కుండగ బోదు ము బలముగల యీ యలలు దాటి పరమ పురద్వారముల వెలుపల గలిసికొని పరిశుద్ధ జనమును గడకు మోక్షము చేరుకొందుము ||దారుణ||
- కరుణామయుని సభలో జొరకపోయిన నిత్య నరక మంత మందున మరియు నంత్య దినపు బాధలు విరివిగ విన గోరువారలు మరణ మొందక మును ప్రత్యక్షీ కరుణ మను గ్రంథమను వినరే ||దారుణ||