a310

310

రాగం - బిలహరి
(చాయ : కొనియాడ దరమె నిన్ను )తాళం - ఆట
    హృదయమనెడు తలుపు నొద్ద యేసు నాధుండు నిలచి సదయు డగుచు దట్టుచుండు సకల విధములను ||హృదయ||

  1. పరుని బోలి నిలుచున్నాడు పరికించి చూడ నతడు పరుడు గా డు రక్షకుండు ప్రాణ స్నేహితుడు ||హృదయ||

  2. కరుణాశీలుం డతడు గాన గాచి యున్నాడు యేసు కరుణ నెఱి గి గారవింప గరము న్యాయంబు ||హృదయ||

  3. ఎంత సేపు నిలువ బెట్టి యేడ్పింతు రతని నాత డెంతో దయచే బిలుచుచున్నా డిప్పుడు మిమ్ములను ||హృదయ||

  4. అతడు మిత్రుడతడు మిత్రుం డఖిల పాపులకు మిర లతని పిలుపు వింటి రేని యతడు ప్రియుడగును ||హృదయ||

  5. జాలిచేత దన హస్తముల జాపి యున్నాడు మిమ్ము నాలిం గనము సేయ గోరి యనిశము కనిపెట్టు ||హృదయ||

  6. సాటిలేని దయగల వాడు సర్వేశు సుతుడు తన మాట వినెడు వారల నెల్ల సూటిగ రక్షించు ||హృదయ||

  7. చేర్చుకొనుడి మీ హృదయమున శ్రీ యేసునాధు నతడు చేర్చు కొనుచు మీ కిచ్చును చిర జీవము గృపను ||హృదయ||

  8. అతడు తప్పక కలుగజేయు నఖిల భాగ్యములు మీర లతని హత్తుకొందు రప్పు డానందముతోడ ||హృదయ||

  9. బ్రతుకు శాశ్వతంబు కాదు పరికించి చూడ గాన బ్రతికి యుండు కాలముననే ప్రభుని గొలువండి ||హృదయ||

Post a Comment

Previous Post Next Post