311
రాగం - బిలహరి(చాయ : కొనియాడ దరమె నిన్ను )తాళం - ఆట
- నరకోటి పాపమందు మున్గి యుండగా దండ్రి వారలన్ రక్షింప ద్రోవ చేసెను.
మాకు గాను ప్రాణమిచ్చి మృత్యు వొందను తన యేక పుత్రు నిచ్చి పంపె నిలకున్.
ఆయనను నమ్మువారు నాశ మొందక నిత్యజీవ మొందిసదా సంతసింతురు.
పాపభారము భరించు పాపులెల్లరు యేసు మాట వినగాను బాధ తీఱును.
చేర రండి, సువిశ్రాంతి నిత్యసంతుష్టి మీకు నిత్తు నంచు యేసు మిమ్ము బిల్చును