312
రాగం - బిలహరి(చాయ : కొనియాడ దరమె నిన్ను )తాళం - ఆట
- మీ పాప మెల్ల బోయెను మేలొందు డేసు పేరన్ గృపా సంపూర్ణ మొందుడి యపార శాంతు డేసు.
వినుండి గొఱ్ఱె పిల్లను విశ్వాస ముంచి యేసున్ ఘనంబుగన్ స్తుతించుడి మనం బుప్పొంగ యేసున్
ఆ రమ్యమైన నామము అణంచు నెల్ల భీతిన్ శరణ్యు లైన వారి నా దరించు నెంతో ప్రీతిన్
ఓ యన్నలారా పాడుడీ యౌదార్యతన్ సర్వేశున్ ఓ యమ్మలారా మ్రొక్కుడీ ప్రియాతి ప్రియుడేసు
ఓ పిల్లలారా కొల్వుడీ యౌన్నత్య రాజు నేనున్ తపించువారి దాతయౌ దయామయున్ శ్రీ యేసున్
శ్రీ యేసుకై యర్పించుడీ మీ యావజ్జీవనమును ప్రియంపు దాసులౌచును రయంబు గొల్వుడేసున్