333
రాగం - బిలహరి(చాయ : కొనియాడ దరమె నిన్ను )తాళం - ఆట
- ఎంత పాపవైనను జీవము క్రీస్తు చెంత పార్థన జేయుము సంతోషమును మన శ్శాంతిని నొసగున నంతుడైన విమ లాత్ము డాదరించు ||పశ్చాత్తా||
- జారచోరకార్యము లేవైనను బారదోలును వేగము నారాజ్యమును వెదకు నరు లందఱకు జీవ ధార లెచ్చెదనని కోరి కర్త వచించె ||పశ్చాత్తా||
- వినుము ప్రభువు వాక్యము జీవము నీవు గనుము రక్షణ భాగ్యము తనువు నిత్యముగాదు నిను నీవె నమ్మకు వినయ బుద్ధిని గ్రీస్తు ఘనము వెదుకుము వేగ ||పశ్చాత్తా||
- దిక్కుమాలిన దానవే జీవము ప్రభుని మ్రొక్కి పరమును జేరవే నిక్కమిది నీ పాప మెక్కువగా నున్న మక్కువతో నిన్ను గ్రక్కున విడిపించు ||పశ్చాత్తా||
- బలములేని దానవే జీవమ యాత్మ బలము బొందుము వేగమే యిలను విద్యాధన బలముల నమ్మక కలుష జాలము వీడి కర కడకేగుము ||పశ్చాత్తా||
- మందపోషకుడు క్రీస్తు జీవమ యేసా నందపూర్ణుడు థీరుడు వందిత సత్సంఘ మందు జేరిన సత్యా నందంబు నిత్యంబు నొందుచు నుందువు ||పశ్చాత్తా||