334
రాగం - బిలహరి(చాయ : కొనియాడ దరమె నిన్ను )తాళం - ఆట
ఉన్నట్టు నేను వచ్చెదన్ నే నొప్పుకొందు దప్పులన్ నీ మాటతో హరించుమా యో గొఱ్ఱె పిల్ల దేవుడా!
ఉన్నట్టు నేను వచ్చెదన్ దుఃఖంబు బాధపర్చగన్ బాపంబు జేయనీకుమా యో గొఱ్ఱె పిల్ల దేవుడా!
ఉన్నట్టు నేను వచ్చెదన్ యేసూ, కబోది నుండగన్ ఆత్మీయదృష్టి నీయుమా యో గొఱ్ఱె పిల్ల దేవుడా!
ఉన్నట్టు నేను వచ్చెదన్ నీ మాట నమ్మునట్టి నన్ మన్నించి చేర్చుకొమ్మయా యో గొఱ్ఱె పిల్ల దేవుడా!
ఉన్నట్టు నేను వచ్చెదన్ నీ ప్రేమ నన్ను బిల్వగన్ నీ వాడ నౌదు సర్వదా యో గొఱ్ఱె పిల్ల దేవుడా!