344
రాగం - బిలహరి(చాయ : కొనియాడ దరమె నిన్ను )తాళం - ఆట
- వేదశాస్త్ర మెఱిగినట్టి యూదుల యధికారియౌ ని కోదే మనెడు పరిసయుండు మదిని దలచుచున్ ||పరమ||
- అతడు రాత్రివేళ ప్రభుని వెతకి పోయి యెదుట స మ్మతిని నిలిచి పిలిచి పల్కె హితవుతోడను ||పరమ||
- బోధకుండ నీవు మోక్ష నాధుడౌ యెహోవ యొక్క వేద వార్త జెప్పెదవు నీ బోధ నెఱుగుదున్ ||పరమ||
- మఱియు నీవు చేయుచున్న గురుతు లెవ్వరైన దైవ వరము లేని యట్టి పాప నరులు చేయరు ||పరమ||
- అనుచు బరిసయుండు పల్క వినుచు యేసు కనికరమున దనకు నిట్లు దెలిపె జాలి మనసుతోడను ||పరమ||
- క్రొత్త జన్మ మెవ్వడైన నెత్త కున్న మోక్షమమునకు నెత్తబడ డటంచు నిజము క్రీస్తు పల్కెను ||పరమ||
- వినుచు బరిసయుండు ముసలి జనుడు మఱల తల్లి గర్భ మునను తిరుగనెట్లు బుట్టు ననుచు బల్కెను ||పరమ||
- అందు కేసు తెల్పె జలము నందు నాత్మయందు జన్మ మొంద కున్న మోక్ష రాజ్య మొంద రనుచును ||పరమ||