343
రాగం - బిలహరి(చాయ : కొనియాడ దరమె నిన్ను )తాళం - ఆట
- ఆ యూట మున్గి దొంగయు హా! శుద్ధు డాయెను నేనట్టి పాపి నిప్పుడు నేనందు మున్గుదు.
నీ యొక్క పాప మట్టిదే నిర్మూల మౌటకు రక్షించు గొఱ్ఱె పిల్ల? నీ రక్తంబె చాలును.
నా నాధు రక్తమందున నే నమ్మి యుండినన్ నా దేవుని నిండు ప్రేమ నే నిందు జూచెదన్.
నా యా యుష్కాల మంతట నా సంతసం బదే నా క్రీస్తు యొక్క రొమ్మునన్ నా గాన మిద్దియే.