342
రాగం - బిలహరి(చాయ : కొనియాడ దరమె నిన్ను )తాళం - ఆట
నేను నాదు శక్తిచే నిన్ను గొల్లజాలను కాల మెల్ల నేడ్చినన్ వేల క్రతుల్ చేసినన్ నేను చేయు పాపము నేనె బాపజాలను.
వట్టి చేయి చాచుచున్ ముట్టి సిల్వ జేరెదన్ దిక్కు లేని పాపిని ప్రక్క జేర్చి ప్రోవుము నా కళంక మెల్లను యేసునాధ, పాపము.
ఈ ధరిత్రియందున నేఱు దాటునప్పుడు నాదరించి నీ కడన్ నాకై చీల్చబడ్డయో నా యనంత శైలమా నన్ను జేర దీయుమా