a353

353

రాగం - బిలహరి
(చాయ : కొనియాడ దరమె నిన్ను )తాళం - ఆట
    నేను క్రీస్తు ప్రభుని జేరి నేను క్రీస్తువాడ నౌదు నేను క్రీస్తు సొత్తు గాన నేను నా సమస్తమును నాధు డేసు కిపుడు యిత్తు ||నే||

  1. నేను క్రీస్తు ననుభవించి నేను క్రీస్తు బోలియుందు నేను నా స్వరూపమందు నా ప్రభుండు గానుపింప నేను నేసులో వసింతు ||నే||

  2. నేను క్రీస్తునందునుండి నేను క్రీస్తులో బెరుగుదు నేను క్రీస్తు దారినడచి నేను క్రీస్తు మనసు నెపుడు గానుపఱతు నెల్లెడను ||నే||

  3. నేను క్రీస్తు సేవజేసి నేను క్రీస్తు సాక్షినౌదు నేను క్రీస్తు సాధ నంబె నేను యనుభవించు రక్ష ణానందంబు జాటెదెపుడు ||నే||

  4. నేను ప్రాణమైన నిచ్చి నేను క్రీస్తుకై బ్రతుకుదు నేను, క్రీస్తు కలిసియున్న నాశన తనయుని శక్తి నేలగూలు నద్భుతముగ ||నే||

Post a Comment

Previous Post Next Post