357
రాగం - బిలహరి(చాయ : కొనియాడ దరమె నిన్ను )తాళం - ఆట
- గురి సిలువ దెస మాకు స్థిరమై నిలిచియున్న దురితము తలయెత్తునే మరి యేసు ప్రక్కలో చొరబారి యందున్న కరుణారసము గ్రోలు టెఱిగి యుండిన చాలు ||నితరుల||
- తలవాల్చుటకు తనకు స్థలము లే దనునట్టి పలుకే మా కైశ్వర్యము బలమిచ్చి యెదిగించు ప్రభు వాగ్దత్తములే మా కిలలో పంచభక్ష్య ములుగా నుండిన చాలు ||నితరుల||
- బెదిరించి సైతాను కదిలింపలేనట్టి కుదురైన విశ్వాసము బొదలుచు మాలో నిం పొదవుచుండిన చాలు మదిలో నెమ్మది యిచ్చు మా యేసు కృప గల్గ ||నితరుల||