358
రాగం - బిలహరి(చాయ : కొనియాడ దరమె నిన్ను )తాళం - ఆట
- రారాజు పంపున రణము సేయగ బూని ధీరులై నిలువుడి దినము శత్రుల గెల్వ ||సిలువ||
- అతడు నిజ ధ్వజ మత్యున్నతి నొంద బ్రతి వీరుని గెల్చు వరకుసేనల నడుపు ||సిలువ||
- మీ స్వీయ బలమున మీ రానుకొనకయే మీ స్వామి బలమును మీరు నమ్మి గెలువ ||సిలువ||
- శత సహస్రము లైన శత్రుల నెదిరించి సతతము ప్రభు సేవ సల్పి ధైర్యము నొంది ||సిలువ||
- దేవు డొసగినట్టి దివ్య కవచము దాల్చి భావ ప్రార్థనాసి బట్టి యుద్ధము సేయ ||సిలువ||
- జయశీలు రగు వారు చారు కిరీట మంది జయశాలి క్రీస్తు దయ జనెదరు సద్గతికి ||సిలువ||