a359

359

రాగం - బిలహరి
(చాయ : కొనియాడ దరమె నిన్ను )తాళం - ఆట
    వీరుల మయ్యా జయ వీరుల మయ్యా మా వైరి జంప యుద్ధమాడు శూరుల మయ్యా ||వీరుల||

  1. మాంస లోక పిశాచి హింసపరచిన మము ధ్వంసముజేయ పై బడిన ధ్వజము విడమాయా ||వీరుల||

  2. పరమ గురు వగు యేసు ప్రభువు నాజ్ఞను బహు త్వరగ బ్రజకు బయలుపర్చు భటుల మే మయా ||వీరుల||

  3. అతి దుష్ట ద్రోహులు మము వెతల బెట్టిన నీ క్షితి సువార్త కొఱ కొకింత సిగ్గు పడ మయా ||వీరుల||

  4. భూలోక నాధులు చాల పోరు సల్పిన మా వేలుపునకు బ్రాణ మైన బెట్టువారము ||వీరుల||

Post a Comment

Previous Post Next Post