363
రాగం - బిలహరి(చాయ : కొనియాడ దరమె నిన్ను )తాళం - ఆట
మీయం దసూయ బట్టి మీ యాత్మ నాశము నెన్నండు గోరునట్టి యనేకు లుందురు మీ రెల్ల రేసు పేరు వచించి యాయనే సర్వాధికారి యంచు సేవింపవలెను.
ప్రచండ మైన దండు పోరాడ లేచినన్ విరోధి శక్తి కొద్ది మరీ తెగించుడీ స్వకీయ శక్తిగాక శ్రీ యేసు నామమున్ స్మరించి వానియందు విశ్వాస ముంచుండీ.