362
రాగం - బిలహరి(చాయ : కొనియాడ దరమె నిన్ను )తాళం - ఆట
- లోక రాజ్య కీర్తి వాడిపోవును క్రీస్తు రాజ్యమైన నిత్య ముండును సాతా నాధిపత్య మాగిపోవును క్రీస్తు దివ్య సభ జయ మొందును.
ఓ జనంబులారా వచ్చి చేరుడీ జయ కీర్తనంబు లెత్తి పాడుడీ కీర్తి, స్తుతి, ఘవ మెన్న డుండును మన క్రీస్తు రాజు నిత్య మేలును.