380
రాగం - బిలహరి(చాయ : కొనియాడ దరమె నిన్ను )తాళం - ఆట
- వింటిని నేను నా హృదయంబు వింత బొందగను మింటనుండి నీవు మేదిని కరుదెంచి యెంటి నర్పించితి వొనరంగ నా కొరకు ||నా యేసు||
- నీ యానతులను నిజముగ మీరి నే నుంటి మున్ను నా యెదను గుందుచు నా పాపముల కొరకు నీ యొద్ద జేరెద నిజరక్షకుడ వనుచు ||నా యేసు||
- నేను నీ నెనరు రుచి జూచితి నిది యెంతో తనరు దీనుఃడ నగు నేను ధృడ కృతజ్ఞత ప్రేమల్ గానుపింపగ నీ కడకు వత్తును దేవ ||నా యేసు||
- నే నశక్తుడను నిను సేవింప నిత్యంబు ధరను గాన బ్రార్థన బూని ఘనుఃడ వని నమ్ముచు నానందమున వత్తు ననిశంబు నీ దరికి ||నా యేసు||
- దయ చేయు మయ్యా సత్యాత్మను దాసుని కిపుడు దయచేసి శుద్ధాత్మ ద్వరగా గల్గించుము ప్రియముగ నీ సేవ పెంపుసేయగ శక్తి ||నా యేసు||
- నీవు నాతోడ నెప్పుడు నుండు నిజ మొనగూడ నీవు నాతో నుండ నిర్భయముగ నేను ద్రోవ బోవుదు నీకు స్తోత్రంబు చేయుచు ||నా యేసు||