a381

381

రాగం - బిలహరి
(చాయ : కొనియాడ దరమె నిన్ను )తాళం - ఆట
    నిన్ను నేను విడువను దేవ నీవు నను దీవించు వరకు నిన్ను నమ్మినవారల నెల్ల నీవు చక్కగ దీవించెదవు ||నిన్ను||

  1. నేను శత్రువునై యుండంగ నీవు నాపై నెనరు జూపి దాన మిచ్చితివి నా కొరకు దారుడౌ నీ ప్రియ పుత్రుని ||నిన్ను||

  2. త్రోవ దప్పి తిరుగుచుండ దుడుకునైన నన్ను గాంచి ప్రోవ(గోరి మదిని నీవు త్రోవను బెట్టితివి నన్ను ||నిన్ను||

  3. నాటనుండి నేటి వరకు నాకు గల్గిన శోధనములలో నేటుగా నను గాచిన వాడవు నీవు గావా, ఓ నా తండ్రి ||నిన్ను||

  4. ఇంత కాలము నన్ను గాచి యికను నన్ను విడువ వనుచు సంత సించి మదిని నేను జక్కగ నీ దరి జేరితిని ||నిన్ను||

  5. నీవు గాక యెవరున్నారు నేలపైని నను గాపాడ చేవ లేని నాకు నీవు చేవ గలుగ జేయ గలవు ||నిన్ను||

  6. అడుగు వారి కిచ్చెద నంచు నాన తిచ్చినావు గాన నడిగెద నిను సాహాయ్యంబు నాత్మమై యున్నట్టి తండ్రి ||నిన్ను||

  7. నాదు ప్రార్థన లన్నియి నీవు నీదు కృపచే నాలకించి నీదు సరణిని నిల్పి నన్ను నేర్పు దనరగ రక్షించితివి ||నిన్ను||

Post a Comment

Previous Post Next Post