a382

382

రాగం - బిలహరి
(చాయ : కొనియాడ దరమె నిన్ను )తాళం - ఆట
    విన రమ్ము యేసు నాధుడ నా మనవి నిప్పుడు ఘన మైన నీదు నెనరుచే నను గావు మెప్పుడు ||విన రమ్ము||

  1. ఎక్కడిద్దఱు ముగ్గురు నీ యొక్క పేరటన్ జేరు టెక్కడో నే నక్కడ కే తెంతు నంటివి ||విన రమ్ము||

  2. మఱి యెవరు దిక్కు ధరణిలోన వేఱు లేరుగా దుర్నరుల కెల్ల దెరవు దెల్పి నావు నీవెగా ||విన రమ్ము||

  3. మరణ మైతి వాహాహా నా కొరకు సిల్వపై నీ కరుణ కల్గె నెంత యీ దు రాత్ముని నాపై ||విన రమ్ము||

  4. సకలంబు నీద టంచు మదిని సంతసించెద వే ఱొకని కించు కంతయైన నుర్వి లేదుగా ||విన రమ్ము||

  5. కోరితి నినుదారిగ నను దూరపర్చకు నీ కూరిమి నా కొసగి నడుపు మరణావధికి ||విన రమ్ము||

  6. వినయంబు సద్గుణంబు చిత్త మునను గూర్పవే ఘన మైన నీతి యనుభవంబు గలుగ జేయవే ||విన రమ్ము||

  7. దేవ దేవ రావె నిన్ను సేవ జేయుదు నను బావనునిగ జేయవె నే పాప నరుడను ||విన రమ్ము||

Post a Comment

Previous Post Next Post