a384

384

రాగం - బిలహరి
(చాయ : కొనియాడ దరమె నిన్ను )తాళం - ఆట
    ఓ ప్రార్థనా సుప్రార్థనా నీ ప్రాభవంబున్ మరతునా? నా ప్రభువున్ ముఖా ముఖిన్ నే బ్రణుతింతు నీ ప్రభన్ నా ప్రాణమా సు ప్రార్థనా నీ ప్రేరణంబుచే గదా నీ ప్రేమధార గ్రోలుదు నో ప్రార్థనా సుప్రార్థనా.
    పిశాచి నన్ను యుక్తితో వశంబు చేయ జూచుచో నీ శాంతమైన దీప్తియే నా శంక లెల్ల మానుపున్ నీ శక్తి నేను మరతునా నా శైలమన ప్రార్థనా నా శోక మెల్ల దీర్చెడు విశేషమైన ప్రార్థనా.
    నీ దివ్యమైన రెక్కలే నా దుఃఖభార మెల్లను నా దేవు డేసు చెంతకు మోదంబు గొంచుబోవును సదా శుభంబు లొందను విధంబు జూప నీవెగా నా ధైర్యమిచ్చు ప్రార్థనా సుధా సుధార ప్రార్థనా
    అరణ్యమైన భూమిలో నా రమ్యమౌ పిస్గా నగం బు రంగుగాను నెక్కి నా చిరగృహంబు జూతును శరీరమున్ విదల్చి నే బరంబు బోవు వేళలో కరంబు నిన్ను మెచ్చెదన్ పరేశు ధ్యాన ప్రార్థనా.

Post a Comment

Previous Post Next Post