385
రాగం - బిలహరి(చాయ : కొనియాడ దరమె నిన్ను )తాళం - ఆట
- తండ్రి, నన్ను దాటవద్దు పాపి నంచు వేడెదన్ నీ మన్నింపు నీదు కృప నా కనుగ్రహించుమీ
రక్షకా, నన్ దాటి పోకు నేను నిన్ను నమ్మితిన్ నీదు దయ పూర్తిగాను నాపై గుమ్మరించుమీ.
పావనాత్మ, దాటి పోకు నేను గుడ్డివాడను జ్ఞానదృష్టి నాకు నిమ్ము నాకు దైవ శక్తి నీ.
మాఱనట్టి దైవ ప్రేమ. క్రీస్తు రక్త పుణ్యము పావనాత్మ ప్రేరణంబు నిండుగాను బోయుమీ.
నన్ను దాటిపోక యేసు నీకు సేవచేయ నా హృదయంబును బంధించి నన్నాశీర్వదించుమీ