388
రాగం - బిలహరి(చాయ : కొనియాడ దరమె నిన్ను )తాళం - ఆట
- బిడ్డలు తండ్రుల వేడగ నన్నము బెడ్డ లిచ్చు వె ఱ్ఱులు గలరే దొడ్డ తండ్రి నిల దోడ్పా టడిగిన నడ్డులేక విమ లాత్మ నొసంగును ||విశ్వా||
- నమ్మకమున జెడు నరులను గానము నమ్మక చెడుదురు నరులయ్యో ఇమ్మహి సకల శు భమ్ములు గలుగును సమ్మతి వెతకగ శాశ్వత రాజ్యము ||విశ్వా||
- వెతకెడు వారికి వెస గృప జూపును గతి గని వేడం గా దెర చున్ సతతము యేసుని చక్కని పేరట హిత మతి వేడగ నెంత యు మేలగు ||విశ్వా||
- బల మేమియు గన బడ దాహ నే సలిపెడు భక్తిని సతి మను చు నలయకు నేలను నావగింజ మరి నిలిపిన జెట్టయి నింగికి నెదుగదె ||విశ్వా||
- అవిశ్వాసమున నతి భీతులచే నవిసి క్రుంగ నగు నే మనసా భువి బాపాత్ముల బ్రోచెడు ప్రభు కృప జవి జూడుము నుతి సల్పుచు వేగమే ||విశ్వా||