a389

389

రాగం - బిలహరి
(చాయ : కొనియాడ దరమె నిన్ను )తాళం - ఆట
    విశ్వాస ఫలితములు విశదమ్ముగా నీకు వివరింతు విను క్రైస్తవా విశ్వాస వంతునికి విశ్వమ్ములోపల మ వశ్యమ్మొదవు క్రైస్తవా ||విశ్వా||

  1. ఫలములన్నిటిలోన ప్రాముఖ్యమైనట్టి ఫలమది పాప క్షమమే విలువైన యీ ఫలము గలుగు నరునికి ముక్తి దొలగ దతనికి క్షేమమే ||విశ్వా||

  2. దానములలోన ప్రధానమనబడు సమా ధానమును గల్గించును మాని తమ్ముగ సమా ధానమును భువిదివుల మహితుతో గల్గించును ||విశ్వా||

  3. నరక పాత్రులమైన నావంటి నీవంటి దురిత జీవుల కెల్లను గొఱతలన్నియు దీర్చ నిరత జీవము నియ్య నిశ్చయమ్మిది చెల్లును ||విశ్వా||

  4. ముత్తెమ్మునకు వలెనె మురికి గప్పగబడిన చిత్తమును చిత్రవిధిగా రత్నమువలె మిగుల రంజిల్ల జేసెడి ప విత్రాత్మ మనకొదవుగా ||విశ్వా||

  5. మేరలేని దోష కారులమై ప్రభుకు దూరముగ దొలగియున్న వారమగు నను నిన్ను చేరంగ బిలిచి కు మారత్వమొసంగు నన్న ||విశ్వా||

  6. సేగు క్రియలను జేసి పోగొట్టుకొన్నట్టి క్షేమ రాజ్యపు హక్కులన్ బాగుగ మనకిచ్చి బాంధవ్య మొనరించు భగవంతునికి మనకున్ ||విశ్వా||

  7. విశ్వనాధుని గొప్ప విశ్రాంతిలోను ప్ర వేశము నాకు నొసంగుగా విశ్వాస ఫలము లివి నీ శాశ్వత రక్ష ణాశ్రయం బిదియె విడకు ||విశ్వా||

Post a Comment

Previous Post Next Post