a390

390

రాగం - బిలహరి
(చాయ : కొనియాడ దరమె నిన్ను )తాళం - ఆట
    సందియము వీడవే నా మనసా యా నందమున గూడవే సందియము లింకేల నిను సుఖ మొంద జేసెడు క్రీస్తు రక్తపు బిందువులు శుభవార్తవాక్యము లందు గని తెలి వొంది బ్రతుకుచు ||సందియము||

  1. చింత లిక మానుము లోకులు దెల్పు భ్రాంతుల్ బడ బోకుము ఎంత వింత దురంత పాపము లంతటను దన రక్తమున గో రంత లేకయె దుడుచు నని సి ద్ధాంత మగు ప్రభు వాక్యమును విని ||సందియము||

  2. పాపములు వీడుము నీ విక బశ్చా త్తాపమున గూడుము ఏపు మీరిన యోర్పుతో నొక పాపి కైన లయంబు గోరక పాపులందఱు దిరిగి వచ్చెడు కోపు గోరెడు కర్త దరి జని ||సందియము||

  3. నేరముల నెంచుకో యేసుని కరుణా సారము దలంచుకో భార ముల్ మోయుచు శ్రమన్ బడు వార లందఱు నమ్మి నా దరి జేర విశ్రమ మిత్తునను ప్రభు సార వాక్కెలు చక్కగా విని ||సందియము||

  4. నిమ్మళము నొందుము రక్షకుని పలుకు నమ్ముకొని యుండుము ఇమ్మహిని బాపులకు నై ప క్షమ్ము జేసి పరాత్పరుని సము ఖమ్మునందు చిత్తమ్ముగా కాయమ్ము బలియుడు నీప్రభుని గని ||సందియము||

  5. ప్రేమ దయా శాంతముల్ కర్తకు భూషా స్తోమము లవంతముల్ నీ మొఱ ల్విని యేసునాధ స్వామి తన రక్తమున బాపము దోమి ని న్నకళంకు జేయును నీ మదిన్ దగ నమ్ముకొన యిక ||సందియము||

Post a Comment

Previous Post Next Post