a391

391

రాగం - బిలహరి
(చాయ : కొనియాడ దరమె నిన్ను )తాళం - ఆట
    విశ్వాసమే విజయము విను ప్రియుడా య విశ్వాస మపజయము విశ్వాసాయుతమైన విసుకని సుకార్యములే విశ్వాసవంతునికి విజయ మొసంగును నిజము ||విశ్వాసమే||

  1. భక్తు డందు వలననే బ్రతుకును మరియు శక్తినొంది నిల్చును యుక్తముగ వర్తించి యుర్విని జయించి ముక్తినొందున టంచు రక్తిగా బాడుదును ||విశ్వాసమే||

  2. మంచి పేరు నొందును సాతాను నెది రించి విజయ మొందును మించిన బాధ ల్స హించి జయించును నంచిత మరణము నానంద ముగగాంచు ||విశ్వాసమే||

  3. ప్రవిమల మొందెదము పాపమునుండి పరిహరింపబడుదుము అవి రతమును మనము నాశ్చర్యముగ ఘనము భువియందున్ దివియందున్ బుధులతో నొందుదుము ||విశ్వాసమే||

  4. నీతిమంతుల మౌదుము నిశ్చయము ప్ర ఖ్యాతి బోధను నేర్తుము ఆ తండ్రి దత్తముల నన్ని యార్జించుచు యాతని సుభద్రములో ననయ ముందుము నిజము ||విశ్వాసమే||

  5. పరిపూర్ణ విశ్వాసమే క్రియలతో నున్న మరి మంచి విశ్వాసమే ధరయందున్ బరమందున్ ధన్యాత్మునిగ జేయున్ సరగు నద్దానినే సంపాదించుము ప్రియుడా ||విశ్వాసమే||

Post a Comment

Previous Post Next Post