394
రాగం - బిలహరి(చాయ : కొనియాడ దరమె నిన్ను )తాళం - ఆట
- తొల్లి నీ వొనరించినట్టి దోషమెంతో యరిసి చూడు చెల్లచెదరై పఱచు తరిని చెయ్యి పట్టినాడు అల్లుకొనిన నీ దుర్గణము లణగ ద్రొక్కి వేసినాడు తల్లడిల్లజేయు నీ శత్రువుల దరిమి ప్రోచినాడు నల్లగా దన్నాడా నేడు వద్దు సందేహంబులు వీడు ||ఎందుకే||
- తల యెత్తరాని చోట గళ లిచ్చి నిలిపినాడు పలుమారు నీ యక్కఱలు తెలిసి యందిచ్చినాడు బలహీన మపుడు నీకు ని ర్భయ మియ్య వచ్చెడు వాడు పలు విధంబు లగు బాధల బార దోలివేసినాడు నెల విప్పుడు లేదన్నాడా నీతో నిక సరి యన్నాడా ||ఎందుకే||
- ఒక్క నీ తల వెండ్రుక యైన నూడిపడ దని చెప్పెడు వాడు దిక్కు నీకిక నేనే యని తన దివ్య వాక్కుల దెలిపెడు వాడు చిక్కు లను బెట్టెడు పగవారి చేత నిను జిక్కింపని వాడు ఇక్కట్టు మెట్టుల దాటించుట కిదిగో యని చెయి యిచ్చెడు వాడు హక్కు లేదన్నాడ నేడు అతడు నిను వెలి వేయబో డు ||ఎందుకే||
- యేసు తన రక్తముతో నిన్ను నెంచి ముందే కొనుచున్నాడు దోసములు వెడలించు విమలా త్ముండు నీ సాక్షిగ నున్నాడు ఆశతో నీవు గొలిచెడు తండ్రి యంతటా గాపై యున్నాడు నీ సురక్షణ జేయు వారు నిను జుట్టి యున్నా రెల్లప్పుడు శేషరహితానంద మల్లెదె. చేరువగుచున్నది చూడుము ||ఎందుకే||