a393

393

రాగం - బిలహరి
(చాయ : కొనియాడ దరమె నిన్ను )తాళం - ఆట
    నీ చరణములే నమ్మితి నీ పాదములే పట్టితి బట్టితి బట్టితి ||నీ చరణములే||

  1. దిక్కిక నీవే చక్కగ రావే మిక్కిలి మ్రొక్కుదు మ్రొక్కుదు మ్రొక్కుదు ||నీ చరణములే||

  2. ఐహిక సుఖము నరసితి నిత్యము ఆహాహా ద్రోహిని ద్రోహిని ద్రోహిని ||నీ చరణములే||

  3. న్యాయము గాని నా క్రియ లన్ని రోయుచు ద్రోయకు త్రోయకు త్రోయకు ||నీ చరణములే||

  4. భావము మార్చి నావెత దీర్చి దేవర ప్రోవవే ప్రోవవే ప్రోవవే ||నీ చరణములే||

  5. చంచల బుద్ధి వంచన యెద్ది ఉంచక త్రుంచవే త్రుంచవే త్రుంచవే ||నీ చరణములే||

  6. చుట్టుకొని యున్న శోధన లున్న పట్టు విడ గొట్టవే కొట్టవే కొట్టవే ||నీ చరణములే||

  7. నాచు పిశాచి నరుకుట గాచి కాచుకో దాచవే దాచవే దాచవే ||నీ చరణములే||

  8. యేసుని తోడ నెన్వరు సాటి దోసము బాపును బాపును బాపును ||నీ చరణములే||

Post a Comment

Previous Post Next Post