a396

396

రాగం - బిలహరి
(చాయ : కొనియాడ దరమె నిన్ను )తాళం - ఆట
    దేవ దాసపాలక రాజా రావే జీవముల ప్రదాతవై ప్రకాశ మొందగా దేవా దేవా దీన పోషకా ||దేవ||

  1. లోకబాధ యిరుకు శోధన నుండి స్వీకరించినావు త్ర్యేకదేవుడా స్తోత్రం స్తోత్రం స్తోత్ర మర్పణ ||దేవ||

  2. దిక్కు లేని పాపికొరకు నీ దేహం మిక్కుటంపు బాధ కొప్పితివి యక్కటా జయం జయం జయము నొందగా ||దేవ||

  3. కఠిను లంత కుటిలముజేసి నిన్ను గట్టి కొట్టి నెట్టి నీకు గొయ్య నెత్తిరా యిదే నా యెడ బ్రేమ జూపితి ||దేవ||

  4. ఇంత యోర్పు యింత శాంతమా నాకై పంతముతో బాపికొరకు బ్రాణ మియ్యగా పాపిన్ నీదగు దాపు జేర్చవే ||దేవ||

  5. కలువరి గిరి వరంబున నాకై తులువను నా కొరకు నిలను సిల్వమోయగా హలెలూయా హలెలూయ హలెలూయ ఆమేన్ ||దేవ||

Post a Comment

Previous Post Next Post