397
రాగం - బిలహరి(చాయ : కొనియాడ దరమె నిన్ను )తాళం - ఆట
- పాపుల రక్షింప బ్రాణమిచ్చిన యేసు బ్రతికి యుండు తన ప్రాపు గోరినవారి భారము తా మోసి ప్రాపయి యుండు ||ఎన్నడు||
- ఎల్ల కాలంబుల నేకరీతిగ నుండు యేసునాధు డాత డెల్ల విశ్వాసుల నెల్ల వేళల దలచి యేలుచుండు ||ఎన్నడు||
- తనవారి యక్కఱలు తానెఱిగి యున్నాడు తప్పకుండ నాత డెనలేని దయబూని వినువారి మనవులు వేడ్కమీఱ ||ఎన్నడు||