457
రాగం - బిలహరి(చాయ : కొనియాడ దరమె నిన్ను )తాళం - ఆట
- పాపంబులు వీడి పశ్చా త్తాపబంబును గూడి దాపున జేరుము దయగల ప్రభువు నీ పాపము బాపియు పాలించును ధర ||శ్రీ యేసు||
- దేవుని మరువకుము దైవ సేవను మరువకుము జీవపు త్రోవను స్థిరముగ నడువను పావన మనసును బ్రాపుగ నిచ్చెడి ||శ్రీ యేసు||
- రక్తము చిందించె ప్రభువు రక్తితో నీ కొరకు రక్తపు టూటల శక్తిని నమ్మిన ముక్తి కలుగును భక్తితో నీవు ||శ్రీ యేసు||
- సిలువయే నీ ఘనము క్రీస్తు సిలువయే నీ ధనము సిలువయే భాగ్యము తులువల కెల్లను సిలువ వలననే కలుగును రక్షణ ||శ్రీ యేసు||