458
రాగం - బిలహరి(చాయ : కొనియాడ దరమె నిన్ను )తాళం - ఆట
- మరణంబు బడయక మున్నే ఘోర తరమైన పాపాత్ము లరసి గుణ పడగ నరక వేదన బాపు కొరకు దేవు డరిమురి తరి యెంతో కరుణతో నొసగె ||బ్రభు||
- కరుణ గల్గెడి దివసములలో నీవు పరమ భాగ్యంబులు బడయుంగ వచ్చు మరణం బెరిగిన జీవాత్మ యద్ది మఱచెదవి ది యెంతో అరుదై యున్నది ||ప్రభు||
- పశ్చాత్తాపం బనెడి తలుపు మూయ బడుమ దేవుని కరుణా భాగ్య మను తలుపు నిశ్చయమంబుగ వేయబడు నెంతో యాశ్చర్యకరమౌ నవన మగుపడదు ||ప్రభు||
- సారస్యమైన కార్యములం జేయ సమయ మనెడి తలుపు సరగ మూయబడున్ వారక మృతి బొందునపుడే గాక సార కార్యము లన్ని జక్కగా జేయు ||ప్రభు||
- గత దినంబులకై స్తుతింతున్ మిగుల కఠినంబులైనట్టి గండముల నుండి ప్రతి దినంబును దప్పించుచు నెంతో మితిలేని కృపచేత బ్రతికించు మనల ||ప్రభు||
- నీతియుతులగు భక్తులారా మన పాతకములకు జచ్చి పరమేశ్వరుని ప్రీతి మ్రొక్కులు చెల్లించుదము నూత్న వత్సరము ప్రభు స్తుతికై బ్రతుకుదుము ||ప్రభు||