466
రాగం - బిలహరి(చాయ : కొనియాడ దరమె నిన్ను )తాళం - ఆట
- పొరుగవాని ప్రేమింతము మనము కొరతలన్ని యిక దీరును మనకు తరుగుపడ్డదా గుణమది మనలో త్వరితగతిని సవరించుకొందమిక ||కఱుణా||
- కుంటి గ్రుడ్డి కుష్ఠు రోగులెందరో కంఠమెత్తి ఘోషించుచు నుండ ఇంటగుడిచి సుఖియించుట న్యాయమ వంటబట్టదది స్వార్థ పర్వతము ||కఱుణా||
- పండువంటి కాపురంబు మనది దండిప్రభుడు దయచేసెను మనకది బండు లోడలౌ ఓడలు బండ్లౌ ముండ్ల కిరీటము ముందు బెట్టుకొని ||కఱుణా||
- మనుజులందు గలవు రెండు తెగలు వినుము పుచ్చుకొనెడువారి దొక తెగ మనసు దీర నిచ్చువారిదొక తెగ గనుమ మనస నీవెందుగలవొ యిక ||కఱుణా||
- కఱుణ రసము మాకుప్రభువా కలుగను కృపా నిమ్మా యెపుడు అరమర లేకను అన్ని సమయముల నందర ప్రేమను జూడగ నడుపుమ ||కఱుణా||