467
రాగం - బిలహరి(చాయ : కొనియాడ దరమె నిన్ను )తాళం - ఆట
- సందియంబు లేల స్వామి సేవ యందు వందనంబు తోడ విత్తుచుందము కొందలంబు లేక కష్టవృత్తి చేసి యందరంబు చేరి యానందింతము
ప్రేమ విత్తనంబుల్ క్షేమయంకు రంబుల్ ప్రీతిన్ కాల మెల్ల ప్రాంతమం తటన్ సేమ మొప్ప నాటినాయకుండు రాగన్ నిండు పంట కోసం గూర్చుకొం దము.