468
రాగం - బిలహరి(చాయ : కొనియాడ దరమె నిన్ను )తాళం - ఆట
- నీతిని కోరక యల్లాడువాని యేసు రక్షించుటకై కాచును ప్రేమతో వారిని బిలుచుకొండి యేసును నమ్మిన రక్షించును.
పాపవిషంబు మనస్సున దాగి గుణము పూర్తిగ జెఱిపినన్ యేసుని ప్రేమ యనుకిరణంబు దాని గుదుర్చును పూర్ణముగా. చెడినవారిని రక్షింప బొండి యేసుడు శక్తిని మీ కీయగా మోక్ష మార్గంబునడిపించుండి వారిని రక్షింప యేసు వచ్చెన్